Site icon NTV Telugu

Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్న బ్రాడ్‌ కర్రీ

Stunning Catch

Stunning Catch

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ బెస్ట్‌ క్యాచ్‌ నమోదైంది. ససెక్స్‌ క్రికెటర్‌ బ్రాడ్‌ కర్రీ ఓ స్టన్నింగ్‌ ఫీట్‌ చేసి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. టీ20 క్రికెట్ లో ఈ అద్భుతమై ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్‌, ససెక్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్‌ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్‌ బెన్నీ హావెల్‌ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు.

Also Read: Kedarnath Disaster: కేదార్‌నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు

ఇక 19వ ఓవర్‌ టైమల్‌ మిల్స్‌ వేశాడు.. ఓవర్‌ రెండో బంతిని మిల్స్‌ ఫ్లాట్‌ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు.. బంతి గాల్లోకి లేచి నేరుగా స్టాండ్స్‌లో పడుతుంది అని అందరు అనుకున్నారు.. ఇక టార్గెట్ కూడా 10 బంతుల్లో 17 పరుగులే అని అందరు భావించారు. కానీ ఇక్కడే అసలు ఊహించని ట్విస్ట్‌ జరిగింది. బౌండరీ లైన్‌ దగ్గర ఉన్న బ్రాడ్‌ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్‌ చేస్తూ అమాంతం గాల్లోకి లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ అ‍ద్భుత దృశ్యాన్ని గ్రౌండ్ లోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు.

Also Read: Marble Palace: రూ.1,600 కోట్లతో మార్బుల్‌ ప్యాలెస్‌.. అమ్మకానికి, అద్దెకు అందుబాటులో

బ్రాడ్‌ కర్రీ అందుకున్న క్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్‌ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్‌ క్యాచ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version