Site icon NTV Telugu

HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

Young Girl

Young Girl

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించాడు ప్రియుడు. గత నెల (మార్చి) 11న పెళ్లికి నిరాకరించిన రమణి కి ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ ఉన్న రక్తం ఎక్కించాడు ప్రియుడు మనోహర్. దీంతో అవమాన భారంతో అన్నోజిగూడ రాజీవ్ గృహ కల్పలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని రమణి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. పెళ్లికి నిరాకరించినందుకు రమణికి ఇంట్లో చొరబడి ఇంజక్షన్ ఎక్కించిన మనోహర్.. రమణి నీ బెదిరించి బలవంతంగా ఎయిడ్స్ తో కూడిన ఇంజక్షన్ ఎక్కించాడు.. ఇప్పటికే ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నాడు మనోహర్..

Also Read:RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!

ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌‌లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి ఎదులాబాద్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆమెకు కుటుంబ సభ్యుల పరిచయంతో మనోహర్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కూడా సమీప బంధువులవుతారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పెళ్లికి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని మనోహర్ అంగీకరించలేకపోయాడు.

మార్చి 11న అన్నోజిగూడ ప్రాంతంలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు మనోహర్. తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కానీ అంతకు ముందే కంత్రీ ప్లాన్ వేసుకుని వచ్చాడు. ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం.. యువతికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న రక్తం ఎక్కించి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం యువతికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయారు. ఐతే పదేపదే జ్వరం ఎందుకు వస్తుందని యవతిని డాక్టర్లు అడిగారు. దీంతో డాక్టర్ల ఒత్తిడితో మనోహర్ సిరంజి ద్వారా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు తెలిపింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు యువతి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. గతంలోని మనోహర్ తండ్రి హెచ్ఐవి సోకి మరణించాడు. తల్లికి కూడా హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న నేపథ్యంలో తనతో పెళ్లికి నిరాకరించిందని భావించిన మనోహర్.. ఆమెకు కూడా హెచ్ఐవీ ఉంటే తనను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ సంఘటన సమాజంలో హెచ్ఐవి వంటి వ్యాధులపై అవగాహన ఎంత అవసరమో మాత్రమే కాకుండా, సంబంధాలలో నిజాయితీ లేకపోతే అది ఎంత పెద్ద విషాదానికి దారి తీస్తుందో చూపించింది. ప్రేమ, పెళ్లి వంటి బంధాలు పరస్పర గౌరవం, బాధ్యతలపై నిలబడాలి గానీ ప్రతీకారం, కోపంతో తీసుకునే నిర్ణయాలు అమాయకుల జీవితాలను నాశనం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version