Site icon NTV Telugu

Boycott Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాన్ చేయండి!

Delhi Capitals

Delhi Capitals

భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పదం కుదరడంతో.. మే 17 నుంచి మ్యాచ్‌లు పున:ప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. తిరిగి భారత్‌కు చేరుకుంటున్నారు. అయితే కొందరు ప్లేయర్స్ తాము ఐపీఎల్ 2025కి రాలేమని స్పష్టం చేశారు.

భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఐపీఎల్‌ 2025కు తిరిగి రానని స్పష్టం చేశాడు. దీంతో మెక్‌గుర్క్‌ ప్రత్యామ్నాయంగా ఢిల్లీ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌లోని మిగిలిన మ్యాచులకు రూ.6 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై మండిపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి ఎలా తీసుకుంటారని భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత్‌తో యుద్ధంలో పాక్‌కు బంగ్లాదేశ్‌ అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముస్తాఫిజుర్‌ ఎంపికను వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాన్ చేయండి అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రాంచైజీ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ కెరీర్ స్టాట్స్ ఇవే.. 54 నుంచి 46కి పడిపోయిన సగటు!

ముస్తాఫిజుర్‌ రహమాన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. గతంలో ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ముస్తాఫిజుర్‌ ఆడాడు. ఐపీఎల్ 2024లో చెన్నై తరఫున 9 మ్యాచ్‌ల్లో ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 పరాజయాలు, ఓ డ్రాతో 13 పాయింట్లు సాధించింది. ఇంకా ఢిల్లీ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంకో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ప్రస్తుతం తీవ్ర పోటీ నేపథ్యంలో 15 పాంట్లతో ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమనే చెప్పాలి.

Exit mobile version