Site icon NTV Telugu

Balayya : బాలయ్యతో బోయపాటి మరో పొలిటికల్ మూవీ..?

Whatsapp Image 2024 04 15 At 2.08.20 Pm

Whatsapp Image 2024 04 15 At 2.08.20 Pm

బోయపాటి, బాలయ్యది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు కూడా తిరుగులేని విజయం అందుకున్నాయి..బాలయ్య లో వుండే ఊర మాస్ ను బోయపాటి చూపించినంతగా ఏ దర్శకుడు ప్రస్తుతం చూపించలేకపోతున్నారు.అయితే గతంలో బాలకృష్ణతో దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఏకంగా నాలుగు బ్లాక్‌బాస్టర్స్‌ హిట్స్ అందించారు., అలాగే ఏ.కోదండరామిరెడ్డి మరియు బి.గోపాల్‌ల వంటి వారు బాలయ్య తో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు.. ఇప్పుడు ఆ దర్శకుల సరసన బోయపాటి శ్రీను చేరబోతున్నారు..ఇప్పటికే బాలయ్యకు మూడు హిట్స్ అందించిన బోయపాటితో బాలయ్య మరో మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బాలయ్యకు వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకులలో బోయపాటి చేరతారు.

ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్న బాలయ్య ఆ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తరువాత మరోసారి బోయపాటి తో సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధం అయ్యారు.బాలయ్య కోసమే బోయపాటి మరో రెండు కథలు సిద్ధం చేశారని తెలుస్తుంది.వాటిలో ఒకటి ‘అఖండ 2’ కాగా మరొకటి పవర్ ఫుల్ పొలిటికల్‌ మూవీ అని తెలుస్తుంది.. ఇటీవలే ఈ రెండు కథలనూ బోయపాటి బాలయ్యకు వినిపించాడని సమాచారం. ఈ రెండు కథలలో బాలయ్యకు పొలిటికల్‌ డ్రామా బాగా నచ్చిందని తెలుస్తున్నది. అయితే..గతంలో లెజెండ్ వంటి పొలిటికల్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి ఈ సారి మరో పొలిటికల్ మూవీ తో రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు..

Exit mobile version