NTV Telugu Site icon

Viral Video : కదులుతున్న రైలుపై విన్యాసాలు.. ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

New Project 2024 01 27t120357.853

New Project 2024 01 27t120357.853

Viral Video : మన దేశంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు చాలా మంది ఎంచుకునే మార్గం రైలు. ఇతర మార్గాలతో పోలిస్తే ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు సాధారణంగా రైలులో రద్దీ ఎక్కువగా ఉండి.. సీట్లు దొరకనప్పుడు నిలబడి ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో TTE లేదా RPF సిబ్బంది రైలులో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఇందులో రైలు తలుపుల వద్ద నిలబడకపోవడం లేదా కిటికీలోంచి చేతులు బయటకు పెట్టకపోవడం వంటివి మీరు తప్పక చూసి ఉంటారు. అయితే ఓ యువకుడు కదులుతున్న రైలులో ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు.

Read Also:Nitish Kumar: నేడు సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..?

అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక యువకుడు కదులుతున్న రైలులో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ యువకుడు రైలు కిటికీలోంచి సగం బయటకి వచ్చి ఎలా విన్యాసాలు చేస్తున్నాడో వీడియోలో చూడవచ్చు. చిన్న పొరపాటు కూడా తన ప్రాణాలను బలిగొంటుందని అతను అస్సలు భయపడడం లేదు. అతను కొన్ని సెకన్ల పాటు కిటికీ నుండి బయటికి వచ్చి రైలు పైకి వచ్చాడు. ఇంతలో అతడు అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. రైలు పై పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భూమ్మీద నూకలున్నట్లున్నాయ్ వాడికి అదృష్టవంతుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కానీ, ఒక చేయి, శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఈ వీడియో @gillujojo అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.

Read Also:Monkey Man : ఆకట్టుకుంటున్న ‘మంకీ మ్యాన్’ ట్రైలర్..