Site icon NTV Telugu

Crime News: అశ్లీల సైట్లకు బానిసై అఘాయిత్యం.. మైనర్‌పై బాలుడు అత్యాచారం

Crime News

Crime News

Crime News: అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు.. అడవిని తగలబెట్టొచ్చు.. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా సాంకేతిక ప్రగతిని వినియోగించే పరిస్థితి కూడా అంతే. అశ్లీలం నెట్టింట్లో నుంచి నట్టింట్లోకి వచ్చేస్తోంది. యువతలో అత్యధికం పోర్న్ సైట్లే చూస్తున్నారట. బడిపిల్లల్లో కూడా పోర్న్ సైట్లు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్లు చాలామంది అందుబాటులోకి రావటం, మొబైల్ కంపెనీల మధ్య పోటీ కారణంగా ఇంటర్నెట్ ఉచితంగా అందుబాటులోకి రావటంతో కోటాను కోట్ల అశ్లీల సైట్లను యువత, బడి పిల్లలు చాలా తేలిగ్గా చూసేయగలుగుతున్నారు. దాని వల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయి. తెలిసీతెలియని బాలలు అశ్లీల చిత్రాలు చూసి నేరాల వైపు చూస్తున్నారు.

తాజాగా ఓ మైనర్‌పై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కలబుర్గి జిల్లా ఆళంద శివార్లలో కోరళ్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చెరుకు తోటలో మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించగా.. ఈ కేసులో మైనర్‌ బాలుడిని అఫ్జలపుర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ 16 ఏళ్ల బాలుడు ఐటీఐ విద్యార్థి కాగా.. ఇతను ఎవరితో కలవకుండా నిత్యం ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ చరవాణిలో అశ్లీల చిత్రాలను చూసేవాడని విచారణలో తేలింది. దీంతో అశ్లీల వీడియోల వ్యామోహంలో పడి ఈ నీచ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.

Sharwanand:15000 అడుగుల ఎత్తు న నుంచి దూకేశాను.. చనిపోతాననుకున్నారు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలుడు కోరళ్లిలో నివాసముంటున్నాడు. అశ్లీల వీడియోలు చూడడానికి బానిసయ్యాడు. ఘటనా సమయంలో బాలిక బహిర్బూమికి వెళ్లడాన్ని గమనించిన బాలుడు ఆమెను వెంబడించాడు. ఆమె అతన్ని చూసి పరుగులు తీసినప్పటికీ వెంటాడి చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రాయితో దాడి చేసి హత్య చేశాడు. ఘటన చేసుకున్న 24 గంటల్లోపే ఆళంద పోలీసులు బాలుడిని అరెస్ట్‌ చేశారు. పదిరోజుల్లోగా చార్జిషేట్‌ వేస్తారని ఎస్పీ వెల్లడించారు.

Exit mobile version