NTV Telugu Site icon

Botsa Satyanarayana : విజయనగరంలో పర్యటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana

Botsa Satyanarayana

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న పేట వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును ఆర్ అండ్ బి కూడలి వద్ద ప్రారంభిస్తారు. మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయం చేరుకొని మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు. చీపురుపల్లి చేరుకొని వైశ్య కల్యాణ మండపం చేరుకొని ఆ కుల పెద్దలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మూడు రోడ్ల కూడలి వద్ద పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. గరికివలస లో గ్రామ సచివాలయం, రైతు కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభిస్తారు.
CM Yogi: కుక్కను తప్పించబోయి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్.. పలువురికి గాయాలు

ఉదయం 10-30 గంటలకు నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు 37 వ వార్డులో తాగునీటి సరఫరా ట్యాంక్ ను ప్రారంభిస్తారు. 6.30 గంటలకు ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న పేట వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును ఆర్ అండ్ బి కూడలి వద్ద ప్రారంభిస్తారు. 26వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయం చేరుకొని మండలం లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు చీపురుపల్లి చేరుకొని వైశ్య కల్యాణ మండపం చేరుకొని ఆ కుల పెద్దలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మూడు రోడ్ల కూడలి వద్ద పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. 6.30 గంటలకు గరికివలస లో గ్రామ సచివాలయం, రైతు కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభిస్తారు. అదే రోజు రాత్రి విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?