Botsa Satyanarayana: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ.3.45 లక్షలు కోట్ల వరకు అప్పు చేసాం, ఆ అప్పులు కూడా పీపీటీ రూపంలో సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికి తెలుసు, కానీ ఈ ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెడుతుందో ఎవరికి తెలీదని అన్నారు. అప్పుల ఆంధ్రగా రాష్ట్రం దూసుకు పోతుందని చెప్పారు.
READ ALSO: KTR-Akhilesh Yadav : రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్ -అఖిలేశ్.. కలిసి టిఫిన్..
సంపద సృష్టించడం వచ్చు, చంద్రుడు మీద సంపద సృష్టిస్తాం అని చెప్పారు, కానీ ఆచరణలో మాత్రం అది కనపడట్లేదని విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆనాటి బీజేపీ అధ్యక్షులు బురద జల్లి ప్రజల్లో భయాందోళన సృష్టించారని, ఇప్పుడు చూస్తే మరో శ్రీలంక, మరో బంగ్లా దేశ్ అయిపోతుంది అన్నారు. అప్పు చేసిన రూ.2. 66 లక్షల కోట్లు దేని కోసం అనేది లెక్కలు చెప్పాలని అన్నారు. ఆఖరికి మద్యం అమ్మకాలు మీద అప్పులు తీసుకొస్తున్నారని విమర్శించారు. నాకు అనుభవం ఉందని చంద్రబాబు, అనుభవం లేదని జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు, అలాగే రూ.3.40 లక్షల కోట్లు అప్పులు ఇష్టనుసారంగా చేసేస్తున్నారని, రాష్ట్రం అప్పుల ఊభిలో కూరుకుపోతుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం చేసిన అప్పులు విద్యా, వైద్యం, వ్యవసాయం కోసం ఖర్చు చేశామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం రైతులను కష్ట పెడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కోసం, పండించిన పంటల గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తున్నామని అన్నారు.
READ ALSO: Mana Shankara Varaprasad Garu : ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు
