Site icon NTV Telugu

Botsa Satyanarayana : బడ్జెట్ ఆనందం, ఆశ్చర్యకరమైంది.. బడ్జెట్ పై బొత్స వ్యాఖ్యలు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో గురజాడ కవితను ప్రస్తావించడం ఆనందకరమైతే.. ఈ ప్రాంతం అభివృద్ధికి కనీస కేటాయింపులు లేక పోవడం బాధాకరం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం సహజం. బీహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి కనీస ప్రాధాన్యత దక్కలేదు.. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత కాదని తేలిపోయింది.. పోలవరం ఎత్తు తగ్గించేసి నిధులు కేటాయించామని చెప్పడం దారుణం..2014 -19 మధ్య ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది.. ప్రత్యేక హోదాను ప్రాకేజ్‌గా మార్చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి.. పోలవరం ఎత్తు తగ్గడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుంది.. పోలవరం ఎత్తు కుదింపు పై ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి..” అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

READ MORE: Baba Ramdev : పతంజలి కేసులో బాబా రాందేవ్, బాలకృష్ణపై అరెస్ట్ వారెంట్

పోలవరంపై పునరాలోచన జరగాలని మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. “త్వరలోనే మేధావులతో సమావేశం నిర్వహిస్తాం. మెడికల్ కాలేజీలు నిర్మాణాలు మధ్య లోనే ఆపేసినప్పుడు పెరుగుతున్న కోటా సీట్ల భర్తీ ఏ విధంగా చేస్తారో చెప్పాలి..డిజిటల్ క్లాస్ రూమ్ లు పెట్టాలని కేంద్రం చెబుతోంది.. ఆ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు అమలు చేసింది. విద్యాశాఖలో మళ్ళీ బీసీ కాలం నాటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది.. నాడు నేడు ద్వారా స్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడాన్ని అర్ధంతరంగా ఆపేశారు.. డిజిటల్ ఎడ్యుకేషన్, నాడు నేడు లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవచ్చు కానీ పేద ప్రజలకు నష్టం చేకూర్చే చర్యలు న్యాయమా అని అడుగుతున్నాం.. రాజకీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని ప్రాధా న్యాతగా పెట్టుకోవాలి.. మారీ టైం బడ్జెట్ లో ఏపీలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, హార్బర్ లకు కేటాయిం పుల పై స్పష్టత కరువైంది.. సంపద సృష్టికర్త గా ఎన్నికల ముందు చెప్పుకున్న చంద్రబాబు ఇపుడు హామీలు అమలులో ఎందుకు విఫలం అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉపసంహరించు కుంటామని కేంద్రం బడ్జెట్ సమావేశాల్లో చెప్పకపోవడం మభ్య పెట్టడమే.. బడ్జెట్ కేటాయింపులు లేనందు వల్ల రాష్ట్ర ప్రభుత్వం గోసను ప్రజలు అర్థం చేసుకోవాలి.. మ్యానిఫెస్టో ప్రకటించినప్పుడు బీజేపీ దానిని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు…..సూపర్ 6కు బీజేపీ వ్యతిరేకం అనేది చెప్పాలి.. అమ్మఒడి, రైతు భరోసా సహా చాలా హామీలు పోయాయి.. రాజకీయాల్లో విశ్వాసనియత ముఖ్యం.. గజకరణ గోజరణ విద్యలు చేస్తారంటే..టక్కు టమారాలు ప్రదర్శిస్తున్నారు.. సాయిరెడ్డి రాజీనామా వ్యక్తిగతం..” అని బొత్స వ్యాఖ్యానించారు.

Exit mobile version