ఈ నెల 7వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో వైసీపీ బీసీ నేతలతో భారీ సభ నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సభ ఏర్పాట్లను వైసీపీ మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ బీసీ మహాసభ పోస్టర్‌ను మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణు, ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అధికారానికి ఒక ఆకారం అంటూ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, వైసీపీలో రెడ్లకు అధికారం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం సరైంది కాదని ఆయన అన్నారు.
Also Read : Avatar 2: కేరళలో ‘అవతార్ 2’ భారీ షాక్… సినిమా రిలీజ్ అవుతుందా?
తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు సంబంధించి ఈ తరహా సభలు జరుపుతామని ఆయన వెల్లడించారు. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను జయహో బీసీ వేదికగా తిప్పి కొట్టాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. బీసీల సమస్యలు ఎన్ని తీర్చాం … ఇంకా ఏం చేయాలనే విషయంపై సభా వేదికగా చెప్తామన్నారు మంత్రి బొత్స. అనంతరం మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఖర్మ పట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నామనే విషయాన్ని సీఎం చెప్పనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈనెల 7న ఒక ఉప్పెన లాగ జయహో బీసీ సభ జరగనుందని ఆయన వెల్లడించారు.
Also Read : Sapota Nutrition Facts : సపోటా పండు తింటే ఇన్ని లాభాలా..?
