NTV Telugu Site icon

Botsa Satyanarayana : స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..?

Botsa

Botsa

చంద్రబాబు నిన్న గాజువాకలో మీటింగ్ పెట్టినపుడు స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయివేటికరణకు వ్యతిరేకమా, అనుకూలమా? అని మంత్రి బొత్స అన్నారు. ద్వంద వైఖరి ని ఖండిస్తున్నామని, మా పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ ప్రయివేటి కరణకు వ్యతిరేకమన్నారు. ప్రజాస్వామ్యం లో, ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమం లు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్ తో కొట్టించారని, ఆ రోజు రాయి తో కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకు అని ఆయన వ్యాఖ్యానించారు.

 

నేను దేన్ని డ్రామా అనను… జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్.. చంద్రబాబు సభలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మేం ఎవరికీ ఏదీ ఆపాదించం.. కానీ జగన్‌పై కుట్ర ప్రకారమే దాడి జరిగింది. పవన్‌ కల్యాణ్‌క ఏం తెలుసు?. పవన్‌ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలి. జగన్‌పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారు. చంద్రబాబు, పవన్‌ మాత్రం వెటకారంగా మాట్లాడారు. చంద్రబాబు సైకిల్‌ ​బాగుందా? ఎప్పుడో తుప్పు పట్టిపోయింది. పవన్‌ డొల్లతనం ఆయన మాట​ల్లోనే తెలిసిపోతోంది. చంద్రాబాబు 14 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు. ప్రజలకు ఏం చేశారో చం‍ద్రబాబు చెప్పగలరా? వాలంటీర్లపై చం‍ద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడారు అని బొత్స వ్యాఖ్యానించారు.