విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 12 సంఘాల ప్రతినిధులు వచ్చారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసుని బంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కస్తూర్భా పాఠశాల ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాలి, అలాగే వారిని క్రమబద్దీకరించాలని, పదోన్నతి, బదిలీలు పొందిన ఉపాధ్యాయుల సవరించిన కేడర్ వివరాలు ఆమోదించాలని, బకాయి ఉన్న జూన్, జూలై వేతనాలు చెల్లించాలిని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు వెల్లడించారు. అయితే.. ఈ క్రమంలో మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చిస్తున్నారు.
Also Read : Devara : ఆ పక్కా యాక్షన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందా..?
ఇదిలా ఉంటే.. సమావేశానికి ముందు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ఒక పిచ్చుకా.. అది చిరంజీవి చెప్పాలి.. రాజశేఖర రెడ్డి పోలవరం శంఖుస్ధాపన చేసారు… రాజశేఖర రెడ్డి తనయుడు పోలవరం పూర్తి చేస్తాడు పోలవరం కాలువల్ని పట్టిసీమ గా మార్చాడు.. రైతులకు రావలసిన ఆర్ & ఆర్ ప్యాకేజీ తాకట్టు పెట్టాడు చంద్రబాబు.. ఇంకొక ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రజలు రెస్టు ఇస్తారు… రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని చూస్తున్నాడు చంద్రబాబు.. ముందుగా లేకపోతే ఆ తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచీ వచ్చాయి.. లోకేష్ ఏ అధికారి గురించీ సరిగా మాట్లాడలేదు… పచ్చకామెర్ల వాడికి అన్నీ పచ్చగా కనిపిస్తాయి… మేం వారాహి ని అడ్డుకోం… చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోం… పరీక్షా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఎంఈఓ జాబ్ ఛార్ట్ ల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటాం. జిల్లాల్లో అకౌంట్ల ను చూసి వారంలోగా రెండునెలల బకాయి జీతాలు ఇస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : NC 23: జాలరిగా నాగచైతన్య.. అమాంతం అంచనాలు పెంచేస్తున్న ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్
