NTV Telugu Site icon

Boris Johnson: ఒక్క నిమిషం చాలు.. పుతిన్‌పై బోరిస్ జాన్సన్‌ సంచలన ఆరోపణలు

Boris Johnson

Boris Johnson

Boris Johnson: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్‌ తనను చంపేస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి ఒక్క నిమిషం చాలు అంటూ ఉక్రెయిన్‌ దురాక్రమణకు ముందు పుతిన్ ఫోన్‌ చేసి బెదిరించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌ ఆక్రమణకు కొన్నిరోజుల ముందు తమ కార్యాలయానికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందని, వ్యక్తిగతంగా తనపై మిస్సైల్‌ దాడికి పాల్పడతానని పుతిన్‌ తనను బెదిరించాడని బోరిస్‌ జాన్సన్‌ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు బోరిస్‌ వ్యాఖ్యలతో కూడిన ఓ డాక్యుమెంటరీని బీబీసీ తాజాగా ప్రసారం చేసింది.

పుతిన్ వ్యాఖ్యలను తాను బెదిరింపుగా పరిగణించలేదని, బదులుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వెళ్లానని జాన్సన్ అన్నారు. ‘‘బోరిస్‌.. మిమ్మల్ని గాయపర్చడం నా ఉద్దేశం కాదు. కానీ, మీపై మిస్సైల్‌ దాడి తప్పదు. అందుకు ఒక్క నిమిషం చాలు. అలా అంతా అయిపోతుంది’’ అని పుతిన్‌ ఆ ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లు జాన్సన్‌ తెలిపారు. అంతేకాదు.. ఆ ఫోన్‌కాల్‌లోనే ఉక్రెయిన్‌ నాటో చేరిక వ్యవహారం గురించి హాట్‌ హాట్‌గా పుతిన్‌ కామెంట్లు చేశాడని బోరిస్‌ వెల్లడించారు. ఆ సమయంలో తాను చాలా సహనంగా వ్యవహరించానని బోరిస్‌ గుర్తు చేసుకున్నారు.

U19 World Cup: వరల్డ్ కప్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి త్రిష.. టైటిల్‌ పోరులో కీ రోల్

ఉక్రెయిన్ సభ్యదేశానికి దగ్గరగా లేకపోయినా రష్యా ఆక్రమించినట్లయితే కఠినమైన పశ్చిమ ఆంక్షలు ఉంటాయని, నాటోకు మద్దతు పెరుగుతుందని జాన్సన్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌ ఆక్రమణను ఖండించిన నేతల్లో బోరిస్‌ జాన్సన్‌ కూడా ఉన్నారు.

Show comments