NTV Telugu Site icon

Boora Narsaiah Goud: నీకు ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది.. రేవంత్ రెడ్డిపై బూర నర్సయ్య ఫైర్

Boora

Boora

రేవంత్ చిన్న వయసులో సీఎం అయ్యారు.. ఆయనకి ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..” ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే మాత్రం సహించరు. ప్రజలు ఏమీ పీకుతారు అనుకుంటే చాలా తప్పు. ఇలాంటివి చేసి చాలా మంది కాలగర్భంలో గడిచి పోయారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఫీ రేయిమెంబర్స్ రాక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫీ రేయిమెంబర్స్ కింద 7500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. విద్య సంస్థల యజమానులు ప్రభుత్వం వద్దకు వెళ్తే.. కేసీఆర్ ను అడగమని అంటున్నారు అంట. మరి కేసీఆర్ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకు 4వేల కోట్ల పెండింగ్ బిల్స్ విడుదల చేశారు. విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు. విద్య, వైద్యం చాలా ముఖ్యమైనవి. 14 వందల కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ బకాయిల వల్ల అరోగ్య శ్రీ పథకం కింద ట్రీట్మెంట్ దొరకడం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Kiran Rathod: ఎంతో మానసిక వేదన అనుభవించా.. సమాధానం కావాలి.. హీరోయిన్ సంచలనం!

పది లక్షల ఆరోగ్య శ్రీ ఎక్కడ అమలు అవుతుంది? అని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. “మోడీ నీ చూసి నేర్చుకోవాలి. నేను తెచ్చిన మోడీ హాస్పిటల్ ఎయిమ్స్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ లో 10 రూపాయలకే పది లక్షల రూపాయల సర్జరీ చేస్తున్నారు. ఉద్యోగస్తుల 4 విడతల da లు పెండింగ్ లో ఉంది. రేవంత్ ఉద్యోగ సంఘాలతో ఎప్పుడైనా మాట్లాడారా?. పీఆర్సీ(Prc) ఉసే లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లడం లేదు. జర్నలిస్టు హెల్త్ కార్డ్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకోవడానికి పనికి వస్తుంది. పబ్లిసిటీ కోసం మాత్రమే కార్డ్స్ ఇస్తున్నారు. వెంటనే భాకి ఉన్న da లు విడుదల చేసి prc ప్రకటించాలి. మొన్నే కేసిఆర్ దశాబ్ది వేడుకలు జరిపారు. మళ్ళీ చెల్లికి పెళ్లి మాదిరిగా దశాబ్ది ఉత్సవాలా ?” అని ఆయన వ్యాఖ్యానించారు.

“డేలి లేబర్ వలె తెలంగాణలో డైలీ ప్రభుత్వం నడుస్తుందని బూర నర్సయ్య అన్నారు. “అసలు కేబినెట్ మీటింగ్ తో వచ్చిన లాభం ఎంటి?. Loc, సీఎం రిలీఫ్ ఫండ్ లో పైరవీలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని ఆన్లైన్ లో అప్లై చేసే విధానం తేవాలి. బోనస్ ఇవ్వకుంటే బాక్సులు బద్దలు అవుతాయి. ఐదు వందల బోనస్ సన్న వడ్ల తో స్టార్ట్ చేస్తున్నామని బట్టి కేసీఆర్ వలె సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.”