Site icon NTV Telugu

Mumbai: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‎కు ఓకే చెప్పిన కోర్టు.. చెట్ల నరికివేతకు అనుమతి

Mumbai High Court

Mumbai High Court

Mumbai: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ముంబై, పొరుగున ఉన్న పాల్ఘర్, థానే జిల్లాలలో సుమారు 22,000 మడ చెట్లను నరికివేయడానికి బాంబే హైకోర్టు శుక్రవారం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కి అనుమతినిచ్చింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ముంబైతోపాటు పొరుగున ఉన్న పాల్ఘడ్‌, థానే జిల్లాల పరిధిలో విస్తరించిన 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడంపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్ బెంబ్‌ తిరస్కరింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్‌ అయితే బాంబే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతంలో పేర్కొన్న 50 వేలకుపైగా చెట్ల నరికివేతను 22 వేలకు తగ్గించినట్లు తెలిపింది. అలాగే నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్ల మొక్కలు నాటుతామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందినట్లు కోర్టుకు వివరించింది.

Read Also: Free Condoms: న్యూ ఇయర్ సర్‎ప్రైజ్ గిఫ్ట్.. యువతకు ఫ్రీగా కండోమ్స్

కాగా, బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఎన్జీవో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. పర్యావరణ, అటవీ, మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న కొన్ని నిబంధనలు, షరతులకు ఎన్‎హెచ్ఎస్ ఆర్సీఎల్ కట్టుబడి ఉండాలని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం పేర్కొంది. డిసెంబర్‌ 1న రిజర్వ్‌ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సుమారు 22,000 మడ చెట్ల నరికివేతకు అనుమతించింది.

Exit mobile version