Mumbai Local Train Blast: 19 ఏళ్ల తరువాత 12 మంది నిర్దోషులుగా విడుదల చేసిన బాంబే హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Local Train Blast: 2006లో భారతదేశాన్ని షాక్‌కు గురిచేసిన ముంబయి లోకల్ ట్రైన్ బాంబు దాడుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 19 సంవత్సరాల తరువాత, ఈ కేసులో దోషులుగా ప్రకటించబడి శిక్షలు విధించబడిన 12 మందిని హైకోర్టు పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేసింది. 2015లో ట్రయల్ కోర్టు ఈ కేసులో 12 మందిని దోషులుగా తేల్చి, వారిలో ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన వారికి జీవితఖైదు విధించింది. అయితే తాజాగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌ల ధర్మాసనం ఈ తీర్పును రద్దు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also:HHVM : హరిహర రిలీజ్ చిక్కులు.. చక్రం తిప్పిన ముగ్గురు నిర్మాతలు
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్‌మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
ప్రాసిక్యూషన్ తమ ఆరోపణలను నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ దాడులు ఈ నిందితుల వల్లే జరిగాయన్నది నమ్మశక్యం కాదు. అందువల్ల వారికి విధించిన శిక్షను రద్దు చేస్తున్నాం అని హైకోర్టు పేర్కొంది. నిందితులు ఇతర కేసుల్లో కూడా లేకపోతే వారిని జైలు నుండి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటన 2006 జూలై 11న చోటుచేసుకుంది. కేవలం 11 నిమిషాల్లో ముంబయి లోకల్ ట్రైన్ లలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చ్‌గేట్ నుండి బయలుదేరిన ట్రైన్ లలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ప్రెషర్ కుకర్లలో బాంబులు అమర్చడం ద్వారా ఈ దాడులు జరిగాయి.
Mudragada Padmanabham: నిలకడగానే ముద్రగడ ఆరోగ్యం.. ఎవరూ ఆందోళన చెందొద్దు
ఈ బాంబులు సాయంత్రం 6:24 నుంచి 6:35 PM లోపు పేలాయి. పేలుళ్లు మటుంగా రోడ్, మహిమ్ జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బొరివలి వద్ద ట్రైన్ లలో చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 800 మందికి పైగా గాయాలపాలయ్యారు.
తాజావార్తలు
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..