Site icon NTV Telugu

Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు

Trisha Stalin

Trisha Stalin

త్రిష ఇంట్లో బాంబు : తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న త్రిష ఇంట్లో బాంబు పెట్టామని, మరికొన్ని గంటల్లో పిలుస్తామని ఆగంతకులు కాల్ చేశారు. బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. త్రిష ఇంటి పరిసర ప్రాంతాలలో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అయితే అక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.

Also Read : KantaraChapter1 Day 1Collections : అదరగొట్టిన కాంతార.. వరల్డ్ వైడ్ డే -1 కలెక్షన్స్ ఎంతంటే?

అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, రాష్ట్ర బీజేపీ ఆఫీస్ కు ఈ తెల్లవారుజామున బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి కూడా ఈ బెదిరింపు కాల్స్ రావడం తమిళనాడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే తమిళ నాడు గవర్నర్ భవనానికి కూడా ఇలా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ ఆఫీస్ కూడా బాంబు పెట్టినట్టు అగంతకులు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చెప్పట్టారు.పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు పోలిసులు. కాల్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు చెన్నై పోలిసులు.

Exit mobile version