Bomb Threat: మాస్కో నుంచి ఢిల్లీకి 400 ప్రయాణికులు, సిబ్బందితో వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3.20గంటలకు విమానం ల్యాండ్ కాగా.. అందులోని ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. అనంతరం విమానం తనిఖీలు జరిపారు. అయితే విమానంలో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం.
Gold Seized: ఎయిర్‌పోర్టులో 41 కిలోల బంగారం పట్టివేత.. 100 కేజీల వెండి స్వాధీనం
ఇటీవల భారత గగనతలంలోకి వచ్చిన ఓ ఇరాన్ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. భారత గగనతలం మీదు ఎగురుతున్న ఇరాన్ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టాయి. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఫైటర్ జెట్లు ఆ విమానాన్ని అనుసరించడం గమనార్హం. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆ విమానాన్ని జైపూర్ లేదా చండీగఢ్‌లో దించాలని అధికారులు ఇరాన్ విమానంలోని పైలట్లకు సూచించగా.. ఆ పైలట్లు నిరాకరించారు. అనంతరం ఆ ఇరాన్ విమానం భారత గగనతలాన్ని వదిలి వెళ్లిపోయింది. చివరకు అది ఫేక్ సమాచారం అని తేలింది.