Bomb threat:ఇరాన్ కు చెందిన ప్యాసింజర్ విమానంలో బాంబ్ ఉన్నట్లు హెచ్చరిక వచ్చింది. విమానం గాల్లో ఉండగానే ఆగంతకుడు విమానంలో బాంబు ఉన్నట్లు అధికారులకు ఫోన్ చేశాడు. ఇరాన్ నుంచి చైనా వెళ్తుండగా భారత గగన తలంపై ఉండగా విమానానికి బాంబు బెదిరింపు సమాచారం అందింది. దీంతో భారత వాయుసేన అప్రమత్తమైంది. వెంటనే వాయుసేన ఫైటర్ జెట్‌లు ఆ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా వైపుగా ప్రయాణిస్తోంది. ఇరాన్ కు చెందిన విమానం గమ్యస్థానం చైనా అని అధికారులు చెబుతున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, బోర్డులో బాంబు ఉండే అవకాశం గురించి ఢిల్లీలోని భద్రతా ఏజెన్సీలకు ఇన్ఫర్మేషన్ అందడంతో ఢిల్లీలో ల్యాండ్ చేయడానికి విమానానికి అనుమతి ఇవ్వలేదు. ఇండియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి హెచ్చరికను విమానంతో పంచుకున్నప్పుడు భారత గగనతలంలోకి ప్రవేశించింది. పంజాబ్, జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌లకు చెందిన భారత వైమానిక దళం Su-30MKI ఫైటర్ జెట్‌లు విమానాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ ఇరానియన్ విమానం పేరు అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు ఆ విమానం కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు.
Read Also: PM Modi Hyderabad Tour: మరోసారి తెలంగాణకు ప్రధాని మోడీ.. విషయం ఇదే..
ఎక్కువైన బెదిరింపులు
గత ఐదు రోజుల క్రితం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానానికి ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్‌గా పంపారు. దీనిపై సింగపూర్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. తన చేతిలో ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు ప్రయాణికుడు బెదిరించాడు. అతడు శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి ప్రయాణిస్తున్న. అయితే ఆ బెదిరింపు ఉత్తదే అని అధికారులు గుర్తించారు. అనంతరం అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇండిగో విమానాన్ని బాంబులతో పేల్చివేస్తామని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఆగంతకులు సమాచారం పంపారు. దీంతో అధికారులు భద్రతా సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అహ్మదాబాద్‌కు ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన ఇండిగోలో బాంబు పెట్టామని పేలుతుందని ఎయిర్‌పోర్టుకు ఇ మొయిల్ అందింది. అన్ని విధాలుగా గాలింపులు జరిపిన తరువాత ఎటువంటి బాంబు ఇతర పేలుడు పదార్థాల ఉనికి లేదని నిర్థారించుకున్న తరువాత ఈ 6ఇ 6045ఇండిగో ఎగిరేందుకు అనుమతిని ఇచ్చారు.