Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు!

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
  • కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసిన ఆగంతకుడు
  • ఫేక్ అని ధ్రువీకరించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు
Shamshabad Airport

Shamshabad Airport

హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ సైబరాబాద్ కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. అప్రమత్తమై ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేశారు. ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని భద్రతా సిబ్బంది తేల్చింది. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు.

బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు గుర్తించారు. నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్‌ ఫేక్‌ అని తేలడంతో ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే ఇలాంటి ఫేక్ కాల్స్ ఎన్నో వచ్చిన విషయం తెలిసిందే.