ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో 57వ మ్యాచ్ ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ వార్త కలకలం సృష్టించింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధికారిక ఇమెయిల్ ఐడికి గుర్తుతెలియని ఇమెయిల్ ఖాతా నుంచి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
READ MORE: Indian Military Trains: భారతీయ ‘సైనిక రైళ్ల’పై పాకిస్థాన్ నిఘా?
ఈ బెదిరింపు తర్వాత.. కోల్‌కతా పోలీసులు వెంటనే చర్య తీసుకున్నారు. పోలీసులు, భద్రతా సంస్థలు సంఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం కాంప్లెక్స్ మొత్తం హై అలర్ట్‌లో ఉంచారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ బెదిరింపు అందడంతో ప్రేక్షకులు, నిర్వాహకులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. ప్రస్తుతం మ్యాచ్ కొనసాగుతోందని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
READ MORE: OPPO: ఒకేసారి కొత్త ఫోన్, టాబ్లెట్, ఇయర్‌బడ్స్లను గ్లోబల్గా విడుదల చేయనున్న ఒప్పో..!
అదే సమయంలో, బాంబు స్క్వాడ్‌లు, నిఘా బృందాలను కూడా మోహరించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఇమెయిల్‌కు వచ్చిన ఈ బెదిరింపు పోలీసులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మెయిల్ పంపిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ మెయిల్ సైబర్ ట్రిక్‌లో భాగమా? లేదా ఏదైనా నిజంగానే ముప్పు పొంచి ఉందా? అనే దానిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కి ఆ రెండు దేశాల మద్దతు..
