NTV Telugu Site icon

Bomb Found: రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యం.. మిలిటరీ గ్రౌండ్స్‌లో బాంబు లభ్యం

Military

Military

Bomb Found From Military Grounds In Punjab: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మిలిటరీ గ్రౌండ్‌లో బాంబు కలకలం సృష్టించడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. పంజాబ్‌లో లూథియానాలోని ఖన్నా నగరంలో గల మిలిటరీ గ్రౌండ్‌లో బుధవారం సజీవ బాంబు షెల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హర్పాల్ సింగ్ తెలిపారు. దానిని నిర్వీర్యం చేసేందుకు జలంధర్ నుంచి బృందం కూడా వచ్చిందని డీఎస్పీ తెలిపారు. దీనిపై విచారణ జరగుతోందని వెల్లడించారు.

Revanth Reddy: మోడీని రక్షించడానికే.. కేసీఆర్ కాంగ్రెస్‌పై నిందలు

అంతకుముందు జనవరి 3 న, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటికి సమీపంలో బాంబును స్క్వాడ్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.బాంబు పేలుళ్లను వెలికితీసిన విషయాన్ని సైన్యానికి కూడా తెలియజేశామని, ఎలాంటి ప్రమాదం లేదని ముఖ్యమంత్రి భద్రతాధికారి కూడా అయిన పంజాబ్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఏకే పాండే తెలిపారు. రాజింద్ర పార్క్‌లోని పొదల్లో మిస్‌ఫైర్ అయిన బాంబు దొరికిందని, ఆ స్థలం స్క్రాప్ డీలర్ల దుకాణాల సమీపంలో ఉందని ఆయన చెప్పారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చండీగఢ్ నోడల్ ఆఫీసర్ సంజీవ్ కోహ్లి ఇంతకుముందు ఇక్కడ లైవ్ బాంబు దొరికిందని చెప్పారు. షెల్ ఎలా చేరిందో చండీగఢ్ పోలీసులు విచారిస్తున్నారని పాండే చెప్పారు.

Show comments