Site icon NTV Telugu

Blast at Afghanistan : సిక్కుల దేవాలయం వద్ద భారీ పేలుడు..

Blast

Blast

Bomb Blast At Afghanistan Gurdwara Temple.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్‌లోని గురుద్వార కార్తే పర్వాన్ ప్రధాన ద్వారం సమీపంలో బుధవారం బాంబు పేలుడు సంభవించింది. సిక్కు, హిందూ సంఘాల సభ్యులు సురక్షితంగా ఉన్నారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చాంధోక్ తెలిపారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఎవరూ ప్రకటించలేదు. పేలుడులో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం వివ‌రాలు వెలుగుచూడ‌క పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు.

 

అయితే.. పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం వివ‌రాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడి సిక్కు వర్గాల‌ను టార్గెట్ చేసుకుని దాడులకు తెగ‌బ‌డుతున్నారు విషయం తెలిసిందే. ఇక కాబూల్‌ సిక్కు గురుద్వారా వద్ద పేలుడు ఘటనపై భారత్‌ విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.

Exit mobile version