Knife Attack: జీతం అడిగినందుకు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన సినీ నిర్మాత.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వెర్సోవా నుంచి ఓ వార్త వెలువడింది. సినీ నిర్మాత తన డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. జీతం విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని.. అనంతరం నిర్మాత కత్తితో దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నిర్మాత పేరు మనీష్ గుప్తా. ఆయన అనేక బాలీవుడ్ చిత్రాలను రూపొందించిన స్క్రీన్ రైటర్, దర్శకుడు. సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి.
READ MORE: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ఈ సంఘటన గురువారం రాత్రి సాగర్ సంజోగ్ భవనంలోని మనీష్ గుప్తా ఇంట్లో జరిగిందని వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. చిత్రనిర్మాత డ్రైవర్ పేరు రాజిబుల్ ఇస్లాం లష్కర్. ఇతను మూడేళ్లుగా మనీష్‌తో పని చేస్తున్నాడు. రూ. 23,000 జీతం వచ్చేది. చిత్రనిర్మాత అతనికి జీతం సకాలంలో చెల్లించలేదు. మే 30న అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించాడు. జీతం ఇవ్వాలని బాధితుడు వేడుకున్నాడు. ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మనీష్ గుప్తా డ్రైవర్‌ను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన తర్వాత, చిత్రనిర్మాతపై భారత శిక్షాస్మృతిలోని 118 (2), 115 (2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ అతన్ని ఇంకా అరెస్టు చేయలేదు. డ్రైవర్ లష్కరే న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ ఆ చిత్రనిర్మాతను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Khammam: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి.!
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..