NTV Telugu Site icon

Poonam Pandey : ‘పూనమ్ బతికే ఉంది.. పబ్లిసిటీ స్టంట్ చేసింది’.. ట్వీట్ చేసిన ఉమైర్ సంధు

Poonam

Poonam

Poonam Pandey : పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. పూనమ్ 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె మేనేజర్ ధృవీకరించారు కానీ ఫ్యాషన్, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు తన ట్వీట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పూనమ్ బతికే ఉందని, ఆమె మరణ వార్తను ఆమె ఆనందిస్తున్నారని ఉమైర్ చెప్పారు. తాను పూనమ్ కజిన్‌తో మాట్లాడానని, ఇది పూనమ్ పబ్లిసిటీ స్టంట్ అని ఉమైర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Read Also:Chile Forest Fire: సెంట్రల్ చిలీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

ఉమైర్ సంధు తన ట్వీట్‌లో, “పూనమ్ పాండే కజిన్‌తో ఇప్పుడే మాట్లాడాను. ఆమె బతికే ఉంది. ఆమె మరణ వార్తను ఎంజాయ్ చేస్తోంది. పూనమ్ పబ్లిసిటీ స్టంట్ చేసింది. ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్‌పై స్పందించారు. ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది నిజమేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్ చేశారు.

Read Also:Kumari Aunty: కుమారి ఆంటీపై DJ సాంగ్ వైరల్..! అదిరిపోయింది!

మరో నెటిజన్ ఉమైర్‌ సంధును మాకు రుజువు కావాలని ప్రశ్నించారు. ఆమె కనుక చనిపోకపోతే వెంటనే తనను అరెస్ట్ చేయాలంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రజలు ఇంకా అయోమయంలో ఉన్నారు. ఆమె అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో అప్ డేట్లు ఇంకా వెల్లడి కాలేదు. ఫిబ్రవరి 2 ఉదయం పూనమ్ పాండే మరణ వార్త ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక పోస్ట్ ద్వారా వెల్లడైంది.