Site icon NTV Telugu

Ae Watan Mere Watan : డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న బాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 02 13 At 9.54.32 Pm

Whatsapp Image 2024 02 13 At 9.54.32 Pm

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍‍ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. భారత దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రంలో సారా అలీఖాన్ రేడియో ఛానెల్‍ను నడిపే మహిళ పాత్రలో నటించింది..ఏ వతన్ మేరే వతన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా (ఫిబ్రవరి 13) నేడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. యదార్థ ఘటనల స్ఫూర్తిగా కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.”అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన సమాచారాన్ని మీ కోసం తీసుకొచ్చాం. ఏ వతన్ మేరే వతన్ సినిమా మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది” అని కరణ్ జోహార్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

ఈ చిత్రంలో సారా అలీఖాన్ ఫస్ట్ లుక్‍ను కూడా రివీల్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.బ్రిటీష్ పాలన సమయంలో రేడియో ఛానెల్ నిర్వహించిన ‘ఉష’ అనే మహిళ స్ఫూర్తిగా ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం రూపొందింది. ఉష పాత్ర చేసిన సారా రేడియో అనౌన్స్‌మెంట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు.స్వాతంత్య్ర పోరాటాన్ని ఓ రేడియో ఛానెల్ ఎలా మార్చిందనే అంశంతో ఏ వతన్ మేరే వతన్ మూవీ తెరకెక్కింది.ఇది ఫిక్షనల్ కథే అయినా కూడా కొన్ని యథార్థ ఘటనలకు స్ఫూర్తిగా తీసుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఉషా మెహతా స్ఫూర్తిగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మహోన్నతమైన దేశభక్తి, త్యాగం, పోరాట పటిమ చూపిన కొందరు స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ తెలిపారు.

Exit mobile version