Site icon NTV Telugu

రాజమౌళి కాళ్లకు మొక్కిన బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్

సాధారణ హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు 11 సినిమాలు చేయగా అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టాడు. ఇప్పుడు 12వ సినిమాగా మల్టీస్టారర్ సినిమాను రూపొందించాడు. ఆ సినిమానే ఆర్.ఆర్.ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.

Read Also: వైరల్.. బిగ్‌బాస్-5 విన్నర్‌పై క్లారిటీ…!!

మరోవైపు ఇతర పాన్ ఇండియా సినిమాలకు రాజమౌళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. తాజాగా బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అమితాబ్, నాగార్జున, ఆలియాభట్ వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ మూవీ తెలుగులోనూ విడుదల అవుతుండటంతో హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.. దర్శక ధీరుడు రాజమౌళి కాళ్లు మొక్కడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఈ సందర్భంగా వేదికపైనే జక్కన్న పాదాలను తాకిన రణబీర్.. ఆశీస్సులు తీసుకున్నాడు.

Exit mobile version