NTV Telugu Site icon

Sunny Leone: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్‌

Sunny Leone

Sunny Leone

Actress Sunny Leone praises husband Daniel Weber: బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ తన మనసు ముక్కలైన క్షణాలను గర్తుచేసుకున్నారు. తన మాజీ ప్రియుడు తనను మోసం చేశాడని తెలిపారు. ఓ వ్యక్తితో తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, మరో రెండు నెలల్లో పెళ్లి అనగా తాను ఇష్టం లేదని చెప్పాడని సన్నీ పేర్కొన్నారు. తన మనసు ముక్కలైన సమయంలో దేవుడు డేనియల్ వెబర్‌ను పంపాడని చెప్పారు. ఎంటీవీలో ప్రసారమయ్యే ‘స్ప్లిట్స్‌విల్లా’ ఐదో సీజన్‌కు సన్నీ లియోన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. షోలో భాగంగా మహిళా కంటెస్టెంట్‌ దేవాంగిని వ్యాస్ తన మాజీ ఫియాన్సీ గురించి మాట్లాడగా.. సన్నీ కూడా తన విషాద ప్రేమ గాథను గర్తుచేసుకున్నారు.

సన్నీ లియోన్‌ మాట్లాడుతూ… ‘నా భర్త డేనియల్ వెబర్‌ను కలవడానికి ముందు నాకు ఎంగేజ్‌మెంట్‌ అయింది. ప్రేమించిన వ్యక్తితోనే ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నాకనిపించింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని అతడిని నేరుగా ఆడిగేశా. లేదు.. ఇకపై నిన్ను ప్రేమించను అని చెప్ప్పాడు. దాంతో నా మనసు ముక్కలైంది. ఎంతో బాధపడ్డాను’ అని తెలిపారు.

Also Read: Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’!

‘ఇది మా పెళ్లికి రెండు నెలల ముందు ఇదంతా జరిగింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్‌ కూడా అయిపోయింది. హవాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఇందుకోసం అన్నీ బుక్‌ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. ఆ సమయంలో అతడు నా హృదయాన్ని గాయపరిచాడు. ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు చాలా రోజులు ప్రయత్నించాను. ఆ సమయంలోనే దేవుడు నాకోసం డేనియల్ వెబర్‌ను పంపాడు. కష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడు. అమ్మా, నాన్న చనిపోయినపుడు నావెంటే ఉన్నాడు. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’ అని సన్నీ లియోన్‌ చెప్పారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ సన్నీ నటిస్తున్నారు. తెలుగులో చివరగా ‘జిన్నా’ సినిమాలో కనిపించారు.

 

Show comments