Janhvi Kapoor Marriage: వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు: జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor About Marriage With Shikhar Pahariya: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్ కనిపించనున్నారు. మే 31న మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీగా ఉన్నారు. ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాల్గొనగా.. పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీ ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడగ్గా.. అందుకు జాన్వీ నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి పెట్టాను అని స్పష్టం చేశారు. ‘ఇటీవలి రోజుల్లో నేను కొన్ని వార్తలు చదివాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. నాకు తెలియకుండానే వారం రోజుల్లో నా పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. ప్రస్తుతం నేను కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు’ అని జాన్వీ తెలిపారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: PM Modi: నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం..
శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు బయట కనిపించడమే ఇందుకు కారణం. వీరు తిరుమలకు కూడా ఓసారి కలిసే వెళ్లారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనువడే ఈ శిఖర్ పహారియా. ‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే శిఖర్‌తో పరిచయం ఉంది. ఇద్దరం కలిసే పెరిగాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నా కలలను అతడి కలలుగా.. అతడి కలలను నా కలలుగా ఫీలవుతాము. ఏ పరిస్థితుల్లోనైనా మాకు మేం సపోర్టుగా ఉంటాం’ అని జాన్వీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!