NTV Telugu Site icon

Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం!

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone Tops IMDb’s List: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలిచారు. ‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్‌ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులను అధిగమించి దీపికా నెంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ మూడో స్థానంలో ఉన్నారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్‌, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ టాప్ 10లో ఉన్నారు. ఈ జాబితాలో సమంత 13వ స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ ఇండస్ట్రీలో రాణిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దీపికా పడుకోణె సొంతం చేసుకున్నారు. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో హిందీలోకి అరంగేట్రం చేసిన దీపికా.. ఆనతి కాలంలోనే స్టార్ అయ్యారు.

Also Read: MS Dhoni-Fan: నీ బాధ్యత నాది.. నీకేమీ కానివ్వను! అభిమానికి ఎంఎస్ ధోనీ హామీ

తనకు ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ప్రేమను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని దీపికా పడుకోణె ఆనందం వ్యక్తం చేశారు. దీపికా ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. హీరో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా దంపతులు త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీపికా గర్భం దాల్చిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆమె బేబీ బంప్ వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.

 

Show comments