Elnaaz Norouzi: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమినే అమ్మాయి సెప్టెంబర్ 13న టెహ్రన్ మెట్రోస్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు టార్చర్ వల్ల మహ్సా అమిని మరణించింది. దీంతో ఇరాన్ లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మహ్స అమిని మృతి చెందడంతో అక్కడి మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. స్కూల్ విద్యార్థినులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ నిరసనల్లో ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోవడం లేదు. తమ హక్కుల కోసం యువత, మహిళలు ఉద్యమిస్తున్నారు. ఇదిలా ఉంటే హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇరాన్ మహళలు తమ జుట్టు కత్తిరించుకుంటూ నిరసనలు తెలుపుతుండగా.. ఇరాన్ నటి ఎల్నాజ్ నొరౌజీ మాత్రం ఏకంగా తన దుస్తులను విప్పి నిరసనలకు మద్దతు తెలిపింది. ఇరాన్‌లో ఈ నిరసనల కారణంగా ఇప్పటికే 100 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది యువతులే ఉన్నారు. వారంతా హిజాబ్ నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ పోలీసుల కస్టడీలో ‘మహ్సా అమినీ’ అనే మహిళ మరణించడంతో ఈ నిరసనలు చెలరేగాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన వీడియోలో నటి నొరౌజీ తొలుత హిజాబ్ ధరించి కనిపించింది. ఆ తర్వాత తన దుస్తులను ఒక్కొక్కటిగా విప్పుతూ.. లోదుస్తులను కూడా విప్పి నిరసన తెలిపింది. ఎవరైనా తాము నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉండాలి అనే సందేశం ఇచ్చింది.
T20 Worldcup 2022: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐనాక్స్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్‌లో నటించి గుర్తింపు పొందిన ఇరాన్ నటి ఎల్నాజ్ నొరౌజీ కూడా హిజాబ్‌వ్యతిరేక పోరాటానికి మద్దతు ఈ నిరసనలో చేశారు. ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లో మహిళ ఏమి ధరించాలనుకుంటున్నారో.. వాటిని ధరిస్తారని.. మమ్మల్ని ఎవరూ ఆపలేరంటూ పొరలుగా బట్టలు విప్పుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయనని.. వాటిని గౌరవించాలని నటి రాసుకొచ్చింది. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే అధికారం… ప్రతి స్త్రీకి తన శరీరంపై నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలంటూ పేర్కొంది. తాను నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదని.. తమకు కావాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నానని ఆమె రాసింది. ఎల్నాజ్ నొరౌజీ తన నటజీవితాన్ని ప్రారంభించిక ముందే.. డియోర్, లాకోస్ట్, లే కాక్ స్పోర్టివ్ వంటి బ్రాండ్‌లకు అంతర్జాతీయ మోడల్‌గా 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు.ఆమె పర్షియన్ సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. భారతదేశంలో ఆమె కథక్ నృత్యం నేర్చుకుంటుంది.