Ajay Devgn: రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌లో తన నటనతో, యాక్షన్‌తో అందరి మనసులను గెలుచుకున్నారు అజయ్ దేవగన్. నిజజీవితంలో అతను ఎంత గ్రౌన్దేడ్‌గా ఉంటాడో.. అతను తన పని, పెట్టుబడుల గురించి కూడా అంత సీరియస్‌గా ఉంటాడు. అజయ్ దేవగన్ గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ఇటీవలే భోళా చిత్రం గ్రాండ్ సక్సెస్ తర్వాత, అజయ్ దేవ్ గన్ కొత్త ఆస్తిని తీసుకున్నాడు. ఈ ఆస్తి ముంబై పరిధిలో ఉంది. ఈ ఆస్తికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం..
Read Also:Indian Plyers: కరీబియన్ దీవిలో టీమిండియా ప్లేయర్స్ రచ్చ రచ్చ.. బీచ్ లో హల్ చల్
అజయ్ దేవగన్ ముంబైలో దాదాపు 45 కోట్ల రూపాయల ఆస్తిని తీసుకున్నాడు. ముంబైలోని నాగరిక ప్రాంతమైన అంధేరి వెస్ట్‌లో అజయ్ ఈ ఆస్తిని తీసుకున్నాడు. ఇది 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ అని, దాని మొదటి యూనిట్ 8,405 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ఆస్తి ఓషివారా సిగ్నేచర్ భవనంలోని 16వ అంతస్తులో ఉంది. ఈ ప్లాట్ ఖరీదు రూ. 30 కోట్ల 35 లక్షలు అని, దీనిపై అజయ్ దేవగన్ విడిగా రూ. 1 కోటి 82 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Read Also:TATA: పెరగనున్న టాటా కార్ల ధరలు… 17 నుంచి అమల్లోకి
ఓషివారా సిగ్నేచర్ బిల్డింగ్‌లో అజయ్ దేవగన్ 17వ అంతస్తులో రూ. 14.74 కోట్లతో మరో రెండు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారని, ఇది 4,893 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాలో విస్తరించింది. 88.44 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించాడు. ఈ ఆస్తులు అజయ్ దేవగన్ అసలు పేరు వీరేంద్ర దేవగన్‌పై 19 ఏప్రిల్ 2023న రిజిస్టర్ చేయబడింది. ముంబైలోని కాజోల్ ఇంటిని 16 కోట్ల 5 లక్షలకు కొనుగోలు చేసిన తర్వాత వారి రిజిస్ట్రీ జరిగింది.