NTV Telugu Site icon

Food Inflation: కేంద్రం దీపావళి కానుక.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు

New Project (24)

New Project (24)

Food Inflation: పండుగల సీజన్ ప్రారంభం కాకముందే పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తునే వేసింది. బియ్యంపై ఎగుమతి సుంకాన్ని వచ్చే ఏడాది వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పుడు వ్యాపారులు బియ్యం ఎగుమతిపై మార్చి 31, 2024 వరకు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్థిక శాఖ విడుదల చేయడం విశేషం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గత ఆగస్టు నెలలో బాయిల్డ్ రైస్ ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. బాయిల్డ్ రైస్ ఎగుమతిపై ఎగుమతి సుంకం అక్టోబర్ 16, 2023 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అంటే అక్టోబర్ 16 వరకు వ్యాపారులు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కానీ దుర్గాపూజ, దీపావళి సమయంలో బియ్యానికి డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఎగుమతిపై విధించిన ఎగుమతి సుంకాన్ని 16 అక్టోబర్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు పెంచింది.

Read Also:Thaman: బాలయ్య మత్తు నుంచి బయటకి వచ్చి… గుంటూరు కారం ఘాటు చూపించు

ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. బియ్యం ధరలను నియంత్రించేందుకు బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధించాలని గతంలో మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశంలో బాస్మతీయేతర బియ్యం నిల్వలు పెరుగుతాయని, దీంతో ఆటోమేటిక్‌గా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో, ప్రభుత్వం పగిలిన బియ్యం ఎగుమతిని కూడా నిషేధించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశం భారత్. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏప్రిల్ – జూన్ మధ్య మొత్తం 15.54 లక్షల టన్నుల బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 11.55 లక్షల టన్నులు మాత్రమే. అంటే ఈ ఏడాది ఎక్కువ బియ్యం దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రిటైల్ మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గుతాయి.

Read Also:Congress First List: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల