Boianapalli Vinod Kumar Criticized union Government
కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా మహాధర్నా చేస్తోన్న విద్యుత్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, సీఎండీ ప్రభాకర్ రావు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ చాలా బిల్లులు ప్రవేశపెడుతుందని, ప్రతి బిల్లు స్టాడింగ్ కమిటీకి పంపించాలన్నారు. కానీ మోదీ ప్రధాని అయినప్పటి నుండి స్టాండింగ్ కమిటీకి బిల్లులు వెళ్లడం లేదన్నారు. ఈ రోజు బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించడంతో మోడీ సగం దిగి వచ్చారని, ఈ బిల్లుపై దాగుడు మూతలు ఆడుతున్నారన్నారు. ఈ బిల్లు ద్వారా ఏం చేయదలచుకున్నారో ముందే చెప్పాలని ఆయన అన్నారు. ఈ బిల్లు వస్తే ఉద్యోగులను తీసేస్తాడని, విద్యుత్ ఉద్యోగుల మీద కత్తి వేలాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రైళ్ల స్థానంలో ప్రైవేటు రైళ్లు రాబోతున్నాయని, కరెంట్ మౌలిక సదుపాయం. ప్రభుత్వం చేతిలో ఉండాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ భవిష్యత్ లో మరింత పవర్ ఫుల్ కాబోతోందని, పెట్టుబడి దారుల కళ్ళు దీని మీద పడిందన్నారు. ఉద్యమానికి జేఏసీ సన్నద్ధం కావాలని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అన్ని రాష్ట్రాలు తిరిగేటప్పుడు యూనియన్ లీడర్లతో సైతం మాట్లాడాలన్నారు. ఇది అహంకారపూరిత, నియంతృత్వ బిల్లు అని ఆయన అన్నారు.
