NTV Telugu Site icon

Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం.. వీడియో వైరల్..

Plane Skid

Plane Skid

ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశంలో తాజాగా విమాన ప్రమాదం జరిగింది. సెనెగల్‌ దేశ రాజధాని డాకర్ సమీపంలోని సెనెగల్ ప్రధాన విమానాశ్రయం రన్‌వే పై విమానం జారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Also Read: Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో..

గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కుప్పకూలిన విమానం హవాయికి చెందిన ట్రాన్స్ బోయింగ్ 737-38జె అని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో దాదాపు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఎయిర్‌పోర్ట్ రన్‌వే పక్కనే ఉన్న పొదల్లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోను ఆన్‌లైన్‌ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో విమానాశ్రయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొంది.

Also Read: Sujana Chowdary: చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ల కిరీటమే..! అన్నీ ఓవర్ నైట్ చేయలేం..

ఈ మధ్య కాలంలో విమానానికి సంబంధించిన అనేక ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. దింతో ప్రజలు విమాన ప్రయాణం చేయడానికి సంకోచిస్తున్నారు.

Show comments