Betting At Munneru: రూ. 2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు గోపిచంద్ మృతదేహం లభ్యమైంది. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత గోపిచంద్ మృతదేహం దొరికింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల మున్నేరులో గోపిచంద్ గల్లంతైన సంగతి తెలిసిందే. 6 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, కుటుంబసభ్యులు వెతికిన అనంతరం కోటికలపూడి వద్ద కృష్ణానదిలో మృతదేహాన్ని గుర్తించారు.
Read Also: Fire Accident: విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్ని ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.. రోశయ్య, గోపీచంద్‌లు ఇద్దరూ వాగులోకి దూకి.. ఎవరు ముందు ఒడ్డుకు చేరితే వారికి 2 వేలు ఇచ్చేలా పందెం వేసుకున్నారు.. పందెంలో భాగంగా మున్నేరు వాగులోకి దూకారు ఇద్దరు యువకులు.. అయితే, దూకిన తర్వాత రోశయ్య ఒడ్డుకు చేరాడు.. కానీ. మాడుగుల గోపిచంద్ అనే యువకుడు గల్లంతయ్యాడు.. ఇక, సమాచారం తెలుసుకున్న పోలీసులు.. స్థానికులు గోపీచంద్ కోసం ఎంత గాలించినా.. ఉపయోగం లేకుండా పోయింది.. గోపీచంద్ ఆచూకీ లభించలేదు.. అయితే, మద్యం మత్తులో ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.. కానీ, మద్యం మత్తులో చేసినా.. మామూలుగా చేసినా.. రూ.2 వేల పందెం.. ఓ నిండు ప్రాణాన్ని తీసింది. 6 రోజుల అనంతరం గోపిచంద్ మృతదేహం దొరికింది.