Bode Prasad: చోడవరం ఇసుక క్వారీపై అధికారులకు ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి చోడవరంలో ఇసుక క్వారీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్నారు.. మంత్రి జోగి రమేష్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చిన దగ్గరి నుంచి ఇసుక క్వారీని స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు.. ప్రభుత్వం జేసీ, కేసీ సంస్థకు టెండరు ఇవ్వగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు..
Read Also: Rajendra Prasad: పెళ్లిపుస్తకం రాసేశాం.. ఇక ఇప్పుడు లగ్గం!
అయితే, మేం అక్కడికి వెళ్లడంతో పొక్లెయినర్‌లు వదిలేసి వారు, అక్కడ సిబ్బంది పారిపోయారని తెలిపారు బోడె ప్రసాద్.. ఎమ్మెల్యే వెహికిల్స్ అని ఇక్కడ నోట్ చేసుకుని అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.. రోజుకు 20 నుంచి 25 లక్షల వరకు ఈ అవినీతి మంత్రికి ఆదాయంగా వస్తుందని విమర్శించారు.. మైలవరంలో తన్నితే పెడన.. అక్కడ తన్నితే.. పెనమలూరు వచ్చారంటూ.. పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ను నియమించడంపై సెటైర్లు వేశారు.. వీళ్లకు ప్రజల అభివృద్ధి పట్టదు.. కేవలం దోచుకోవడం, దాచుకోవడం.. ముఖ్యమంత్రికి కప్పం కట్టడం మాత్రమే తెలుసన్నారు. అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేద్దాము అన్న ఒక్క అధికారి కూడా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారా లోకేష్ ఎలా ఎర్ర బుక్ మైంటైన్ చేస్తున్నారో.. అలాగే, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని అధికారులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్.