Indian 3 : ఇండియన్ 3 గురించి క్లారిటీ ఇచ్చిన బాబీ సింహా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2.విశ్వ నటుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. కాగా ఇదే ప్రాంఛైజీలో ఇండియన్ 3 సినిమా కూడా ఉండబోతుందని ఇప్పటికే నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి ఇండియన్ 2 చిత్రంలో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన బాబీ సింహా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ 3కు సంబంధించి ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చి బాబీ సింహా మూవీ పై మరిన్ని అంచనాలు పెంచేసాడు. ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 షూటింగ్ కూడా ఒకేసారి కొనసాగుతున్నాయని ఆయన కామెంట్ చేసినట్లు సమాచారం.దీంతో త్రీక్వెల్ పక్కా అని అర్థమవుతోంది. అయితే మూడో పార్టుకు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
పాన్ ఇండియా కథాంశం తో వస్తోన్న ఈ మూవీ లో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, బ్రహ్మానందం, సముద్రఖని, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.శంకర్ టీం ఇప్పటికే ఇండియన్ 2లోనీ కీలక షెడ్యూల్‌ను చెన్నై , లాస్ ఏంజెల్స్, తైవాన్ మరియు సౌతాఫ్రికా ప్రాంతాల్లో చిత్రీకరించారు. శంకర్ సినిమాలలో బలమైన కథ, సన్నివేశాలతో పాటుభారీ స్థాయిలో సాంగ్స్ కూడా ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఇండియన్ 2 ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది.ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15 న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సమయంలో నే ఇండియన్ 3 గురించి కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా వుంది..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!