Site icon NTV Telugu

Bobby Deol :యానిమల్ మూవీ లో అలా నటించడం ఇబ్బందిగా అనిపించింది..

Whatsapp Image 2023 12 20 At 2.31.17 Pm

Whatsapp Image 2023 12 20 At 2.31.17 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.అయితే ‘యానిమల్’ సినిమా తో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా లో బాబీ డియోల్ అబ్రార్ అనే మూగ విలన్ ​గా నటించి ఎంతగానో మెప్పించాడు.తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ నిడివి తక్కువే అయిన కూడా తనదైన శైలి లో నటించి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ నటనకు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్‌ కు వస్తున్న రెస్పాన్స్ పట్ల కొన్ని బాబీ డియోల్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాబీ డియోల్ ఈ సినిమా లో అతడిని ఇబ్బందిపెట్టిన విషయాలను తెలియజేసాడు.. యానిమల్ షూటింగ్ మొదట్లో నా పాత్ర గురించి చాలా ఇబ్బందిపడ్డాను. అయితే ఎందుకిలా చేస్తున్నా అని తరువాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అనంతరం ఈ సినిమా లో కేవలం నేను ఓ విలన్ పాత్ర లో మాత్రమే నటిస్తున్నాని గ్రహించాను. ఇక షూటింగ్ సమయం లో ఎవరితో కోపం గా ఉన్నానో వారితోనే షూటింగ్ తరువాత కలిసి డిన్నర్ చేశాను. యానిమల్‌ లో నేను విలన్ అని ఎప్పుడూ కూడా అనుకోలేదు. కేవలం ఫ్యామిలీ ని ఎక్కువగా ప్రేమించే ఓ వ్యక్తి గానే నేను భావించాను. తన తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడి పాత్రలో మాత్రమే తాను నటించానంటూ బాబీ చెప్పుకోచ్చారు.

Exit mobile version