బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్ నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్ను చెప్పింది.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.. మొత్తం 20 రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్/ డిప్యూటీ రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 14, 2023 చివరి తేదీగా నిర్ణయించారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
అర్హతలు..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి…
వయసు..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 14, 2023 నాటికి గరిష్టంగా 45 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లు ఎలాంటి రుజుము చెల్లించాల్సిన అవసరం లేదు.. ఉద్యోగానికి ఎంపిక అయిన వాళ్లు దేశంలో ఎక్కడైనా పని చెయ్యాల్సి వస్తుంది.
ఇంటర్వ్యూ పక్రియ..
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
ఉద్యోగాలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 04/09/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2023
గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కన్నా ఎక్కువగా ఈసారి నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు.. మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..