Site icon NTV Telugu

boAt Smart Ring: ఫిట్‌నెస్, హెల్త్ డేటాను ట్రాక్ చేసే ఉంగరం.. ఎలా పని చేస్తుందంటే?

Boat

Boat

బోట్ కంపెనీ ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకొనేలా కొత్త ప్రోడక్ట్స్ ను అభివృద్ధి చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది..బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు కంపెనీ మరొక స్మార్ట్ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది.. ఆ ప్రోడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది.. అదేంటో కాదు.. స్మార్ట్ రింగ్.. ఎస్..బోట్ స్మార్ట్ రింగ్ పేరుతో తాజాగా ఇండియాలో ఆవిష్కరించిన ఈ కొత్త స్మార్ట్ డివైజ్‌ను వేలుకు పెట్టుకోవచ్చు. ఇది యూజర్ల హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, స్లీప్ క్వాలిటీ, SpO2, టెంపరేచర్ వంటి హెల్త్, ఫిట్‌నెస్ వివరాలను ట్రాక్ చేస్తుంది. ఈ రింగ్ మహిళల పిరియడ్స్‌ను కూడా ట్రాక్ చేయగలదు.. ఈ రింగ్ గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా స్మార్ట్ రింగ్ ను తయారు చెయ్యలేదు.. ఈ రింగ్ ను సెరామిక్, మెటల్ వంటి హై-క్వాలిటీ పదార్థాలతో తయారు చేశారు. ఇది యూజర్లకు ప్రీమియం లుక్, ఫీల్‌ను అందిస్తుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. స్మార్ట్ రింగ్ 5 ATM ప్రెషర్ వరకు వాటర్ రెసిస్టెన్స్ సామర్థ్యంతో వస్తుంది.. ఎప్పుడూ మన చేతికి ఉంచుకోవచ్చు.. నీటిలో, ఎండలో ఎక్కడకు వెళ్లినా దీన్ని ధరించవచ్చు.. ఇది చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.. ఈ రింగ్ ఫీచర్స్ విషయానికొస్తే..

స్మార్ట్‌వాచ్ అందించిన ఫీచర్లనే ఆఫర్ చేస్తుంది. SpO2 మానిటరింగ్ ఫీచర్ ద్వారా స్మార్ట్ రింగ్ యూజర్ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను, శ్వాసకోశ ఆరోగ్యాన్ని చెక్ చేస్తుంది. స్లీప్ మానిటరింగ్‌తో స్లీప్ ప్యాటర్న్స్, మొత్తం నిద్ర సమయం, వివిధ నిద్ర దశలను విశ్లేషిస్తుంది. స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మెన్‌స్ట్రువల్ ట్రాకర్‌తో మహిళల కోసం స్మార్ట్ నోటిఫికేషన్లు, రిమైండర్లతో పాటు మెన్‌స్ట్రువల్ సైకిల్స్ ట్రాక్ ను కూడా అంచనా వేస్తుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ రింగ్ కు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉందని తెలుస్తుంది..అయితే ఈ స్మార్ట్ రింగ్ భారత మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. దీని ధర గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Exit mobile version