NTV Telugu Site icon

BMW M4 CS Price: బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ లాంచ్.. ధర రూ.1.89 కోట్లు!

Bmw M4 Cs

Bmw M4 Cs

BMW M4 CS Launch: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ సరికొత్త కారును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ‘ఎం4 సీఎస్’ పేరుతో కొత్త కారును రిలీజ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). భారత మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ ఇదే కావడం విశేషం. సీఎస్ (కాంపిటీషన్ స్పోర్ట్) మోడల్ కంటే ఎం4 సీఎస్ ధర రూ. 36 లక్షలు ఎక్కువ. ఈ కారు డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే.. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ కారు 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్‌కి పెంచడంతో.. పవర్ కాస్త ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఎం4 కంటే 0.1 సెకన్లు అధికం. ఇక టాప్ స్పీడ్ గంటకు 302 కిమీ. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు గట్టి పోటీ దారుగా ఉంటుంది.

Also Read: Tata Nexon EV: బిగ్ బ్యాటరీతో టాటా నెక్సాన్‌ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489కిమీ ప్రయాణం!

బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ కారులో టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్‌తో వస్తాయి. ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ ఉంటాయి. ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉంటుంది. 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉంటుంది. ఎం కార్బన్ బకెట్ సీట్స్ ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో ఎరుపు రంగు సీఎస్ వర్డ్స్, ఎం సీట్ బెల్ట్‌లు, ఎం4 సీఎస్ డోర్ సిల్స్ ఉన్నాయి.