Site icon NTV Telugu

BMW CE 04 Price: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

Bmw Ce 04 Electric Scooter

Bmw Ce 04 Electric Scooter

BMW CE 04 Electric Scooter Price in India: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరిట స్కూటర్‌ను తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న బీఎండబ్ల్యూ సంస్థ.. ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. సీఈ 04 స్కూటర్‌ ధర ధర రూ.14.9 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూంలో) ఉంది. ఈ ధర చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ఈ ప్రీమియం స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓసారి చూద్దాం.

డిజైన్‌ పరంగా సీఈ 04ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. బాడీ ప్యానెల్స్‌ విశాలంగా ఉండడంతో స్కూటర్‌ పరిమాణం పెద్దగా ఉంటుంది. సీ 400 జీటీ తరహాలోనే కొన్ని మార్పులు చేసి హెడ్‌లైట్‌ను డిజైన్‌ చేశారు. ఒకే సీటును రెండు కలర్లతో ఇచ్చారు. ఇంపీరియల్‌ బ్లూ, లైట్‌ వైట్‌ రంగుల్లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది. ఇందులో ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఏబీఎస్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ ఇల్యుమినేషన్‌, 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ, తాళం చెవి లేకుండానే ఆపరేట్‌ చేయడం వంటి ఫీచర్స్ ఉన్నాయి.

బీఎండబ్ల్యూ సీఈ 04లో మూడు రైడ్‌ మోడ్‌ (ఎకో, రెయిన్‌, రోడ్డు)లను ఇచ్చారు. ఎమర్జెన్సీ కాల్‌, రివర్స్‌ గేర్‌, టైప్‌-సి యూఎస్‌బీ పోర్ట్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ముందు డబుల్‌ డిస్క్‌, వెనక సింగిల్‌ డిస్క్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ ఇచ్చారు. ఇది 15kW మోటార్‌తో వస్తోంది. గరిష్ఠంగా 42హెచ్‌పీ శక్తిని, 62ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0-50 కిమీ వేగాన్ని 2.6 సెకన్లలోనే అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 120 కిమీ వేగంతో వెళుతుంది. దీంట్లో 8.5kWh బ్యాటరీని ఇచ్చారు.

Also Read: Hero Vishal: సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే ఆపుకోండి! ఫిల్మ్ చాంబర్‌కి విశాల్ సవాల్

బీఎండబ్ల్యూ సీఈ 04 బ్యాటరీని పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో 2.3kW ఛార్జర్‌ను ఇస్తున్నారు. దీంతో పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. వేగంగా ఛార్జ్‌ కావాలనుకుంటే.. అదనపు ఖర్చుతో 6.9kW ఫాస్ట్‌ ఛార్జర్‌ను కంపెనీ అందిస్తోంది.

Exit mobile version