NTV Telugu Site icon

BMW M 1000 XR Launch : అదిరిపోయే ఫీచర్లతో బీఎండబ్ల్యూ బైక్.. ధర ఎంతంటే?

Bmw M 1000 Xr

Bmw M 1000 Xr

యూత్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకొస్తూ సరికొత్త బైక్ లను ఆయా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.. తాజాగా మరో కొత్త బైక్ వచ్చేసింది.. బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త మోడల్ లో అదిరిపోయే ఫీచర్ల తో కొత్త బైక్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బీఎండబ్ల్యూ M 1000XR బైక్ వచ్చేసింది.. ఆ బైక్ ఫీచర్స్, ధర ఇప్పుడు తెలుసుకుందాం..

బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ 999సీసీ, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ మోటార్‌తో 201బీహెచ్‌పీ, 113ఎన్ఎమ్ గరిష్ట శక్తిని టార్క్ అందిస్తుంది. ఎమ్ 1000 ఆర్ఆర్ కొన్ని మార్పులు చేసి ఈ బైక్ ను లాంచ్ చేసింది.. రేసింగ్ లకు లేదా లాంగ్ టూర్ల కు వెళ్ళేవాళ్లకు ఈ బైకు బెస్ట్.. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇంకా, ఐదు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. అందులో రెయిన్, రోడ్, డైనమిక్, రేస్, రేస్ ప్రో ఉన్నాయి..

అలాగే 6.5-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, హీటెడ్ గ్రిప్‌లు, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, టీపీఎమ్ఎస్, ఎల్ఈడీ లైట్లు వంటి గూడీస్‌ను కూడా కలిగి ఉంటాయి.. వెనుకవైపు 265ఎమ్ఎమ్ డిస్క్ ఉంటాయి. ఎమ్ 1000 ఎక్స్ఆర్ 10 ఫేస్ అడ్జెస్ట్, బ్యాక్ సైడ్ ఎడ్జెస్ట్ చేయగల మోనోషాక్‌తో 45ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్‌ కలిగి ఉంది.. కార్బన్ ఫైబర్ సైడ్ ప్యానెల్స్‌తో పాటు ఫ్రంట్, బ్యాక్ మడ్‌గార్డ్‌లతో కేవలం బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ పెయింట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది.. ఇక ఈ బైక్ ధర 45 లక్షల ధరకు లాంచ్ చేసింది.. ఈ బైక్ లు లాంచ్ అయ్యాయి.. కానీ జూన్ నుంచి డెలివరీ కానున్నాయని తెలుస్తుంది..

Show comments