NTV Telugu Site icon

Tribute To Sridevi: Tribute To Sridevi: ఇది కదా శ్రీదేవికి సిసలైన నివాళి

Sri Devi Chowk

Sri Devi Chowk

Tribute to legendary bollywood actress sridevi: తెలుగమ్మాయి అయినా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది శ్రీ దేవి. అందుకే ఆమెని బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్ అంటారు. నేటికీ ఆమె మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రజలను ఎంతగానో అలరిస్తున్నాయి. 24 ఫిబ్రవరి 2018న శ్రీదేవి మరణంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె కుటుంబమే కాదు కోట్లాది మంది అభిమానులు ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇప్పుడు BMC (బృహన్‌ముంబై మునిసిపాలిటీ కార్పొరేషన్) శ్రీదేవికి ఘనమైన నివాళి అర్పించింది. శ్రీదేవి తన కుటుంబంతో నివసించిన ప్రదేశం, ఆమె ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికిన అంధేరి లోఖండ్‌వాలా ప్రాంతంలోని ఒక కూడలికి శ్రీదేవి పేరు పెట్టారు. లోఖండ్‌వాలాలోని ఒక కూడలికి ఇప్పుడు ‘శ్రీదేవి కపూర్ చౌక్’ అని పేరు పెట్టారు. నిజానికి, శ్రీదేవి ముంబైలోని అంధేరీ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో నివసించారు.

Sri Devi Chowk

ఈ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న చాలా మంది స్థానిక నివాసితులు, కొన్ని సంస్థలు ఈ విషయంలో BMCకి ఒక పిటిషన్ పంపారు. అంతే కాకుండా శ్రీదేవి అంతిమ యాత్ర కూడా ఇదే కూడలి గుండా సాగింది. ఈ ప్రాంతంలోని చాలా మందితో శ్రీదేవికి మంచి సంబంధాలుండేవి. కాబట్టి, అక్కడ నివసించే ప్రజల కోరికలను గౌరవిస్తూ, BMC అక్కడ ఒక కూడలికి శ్రీదేవి అని పేరు పెట్టింది. శ్రీదేవి 6 సంవత్సరాల క్రితం అంటే 24 ఫిబ్రవరి 2018న దుబాయ్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మరణించారు . అప్పటికి ఆమె వయసు 54 ఏళ్లు మాత్రమే. శ్రీదేవి తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లారు. ఆమె మరణించే సమయంలో, ఆమె భర్త బోనీ కపూర్, వారి కుమార్తెలు జాన్వీ-ఖుషి ముంబైలో ఉన్నారు. 4 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించిన ఈ లెజెండరీ నటి 300 కి పైగా చిత్రాలలో నటించింది. ఇక హిందీలోనే కాకుండా మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో ఆమె ప్రేక్షకులను అలరించారు.