Site icon NTV Telugu

BMC Result: ముంబై అడ్డా ‘మహాయుతి’దే.. దూసుకుపోతున్న కూటమి

Bmc6

Bmc6

ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతుంది. బీజేపీ-శివసేన కూటమి 119 స్థానాల్లో.. థాక్రే కూటమి 70 స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తానికి ముంబై మేయర్ పీఠాన్ని మహాయతి కూటమి సొంతం చేసుకోబోతుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మరాఠీలు అధికార కూటమికే పట్టం కట్టారు. ముంబైతో పాటు 29 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుంది. ముంబైలో మొత్తం 227 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం కూటమి మెజార్టీ మార్కు దాటేసింది. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ… బాణాసంచా కాలుస్తూ వేడుకలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్‌లో ఏం జరుగుతోంది?.. టెహ్రాన్ దిశగా వెళ్తోన్న అత్యంత శక్తివంతమైన యూఎస్ నౌకలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తగ్గట్టుగానే ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ముంబై ప్రజలు మహాయుతి కూటమికే అవకాశం కల్పించారు. ముంబై మేయర్ పీఠం దక్కించుకునేందుకు 20 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న ఉద్ధవ్ థాక్రే-రాజ్ థాక్రే కలిశారు. అయినా కూడా ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమయ్యారు. మరాఠీలు అంతగా ఇష్టపడలేనట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Fastag Rules: వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!

Exit mobile version