NTV Telugu Site icon

Viral Video : ఏందయ్యా ఇది.. దోస ప్రియులు చూస్తే అస్సలు తట్టుకోలేరు..

Blue Dosaa

Blue Dosaa

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వింత వంటలకు సంబందించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంటాయి.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..

మసాలా దోస, ప్లైన్ దోస, కారం దోస, ఎగ్ దోస, రవ్వ దోస ఇలా రకరకాల వెరైటీగా ఉండే దోసలను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే ఇప్పుడు చూస్తే బ్లూ దోస వీడియో తెగ వైరల్ అవుతుంది..అది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఫుడ్ స్టాల్, దాని అసాధారణమైన సృష్టి బ్లూ దోస తో ఆకట్టుకుంది..ఈ ప్రత్యేకమైన రెండిషన్ లోతైన సముద్రాన్ని గుర్తుకు తెచ్చే అద్భుతమైన నీలి రంగుతో నిబంధనలను సవాలు చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆహార విమర్శకులు, బ్లాగర్‌లు మరియు రోజువారీ నెటిజన్‌లు బ్లూ ఓషన్ దోసపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి యుద్ధభూమిగా మారాయి. చెఫ్‌ల సృజనాత్మకత మరియు సాహసోపేతమైన విధానాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు క్లాసిక్ రెసిపీని ట్యాంపరింగ్ చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ బ్లూ దోస వీడియో వైరల్ అవుతుంది.. ఎలా ఉందో ఒకసారి చూసేయ్యండి..