Bhadra :మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ “భద్ర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ చిత్రంతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.బోయపాటి తెరకెక్కించిన సినిమాలలో “భద్ర” మూవీ ది బెస్ట్ గా నిలుస్తుంది.ఈ చిత్రంలో మీరా జాస్మిన్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సునీల్,బ్రహ్మాజీ,ఈశ్వరి రావ్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Read Also:Anil Ravipudi : వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?
ఫ్యాక్షన్ బ్రాక్‌డ్యాప్ కథకు ఎమోషనల్ లవ్ స్టోరీని జత చేసి దర్శకుడు బోయపాటి భద్ర సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం మే 12 2005 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలన విజయం సాధిచింది..భద్ర సినిమాతో రవితేజకు మాస్ హీరోగా మరింత గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నేటికీ 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్రబృందం ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
19 yrs for Mass Maharaja @RaviTeja_offl's Superhit #Bhadra Produced by Super Producer #DilRaju Introducing Mass Director #BoyapatiSrinu in @SVC_official banner (12/05/2005) Rockstar @ThisIsDSP Musical pic.twitter.com/NIW9R6eK40
— BA Raju's Team (@baraju_SuperHit) May 12, 2024
