Blankput Smart TV: భారత్‌లో టీవీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లౌపుంక్ట్ తన తొలి 32 అంగుళాల జియోటెల్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర కేవలం రూ.9,699 మాత్రమే కాగా.. రేపటి (జనవరి 22న) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించబడుతుంది. చిన్న స్క్రీన్ సైజ్ టీవీలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉండటంతో, తక్కువ ధరలో స్మార్ట్ టీవీకి మారాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది.
Read Also: IND vs NZ 1st T20: టీమిండియాదే బ్యాటింగ్.. ఇషాన్ కిషన్ ఇన్, ప్లేయింగ్ 11 ఇదే!
భారతీయ వినియోగదారుల కోసమే జియోటెల్ ఓఎస్
ఈ స్మార్ట్ టీవీ జియోటెల్ ఓఎస్‌పై పని చేస్తుంది. ఇది భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్-ఫోకస్‌డ్ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్.. ఇందులో హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, గుజరాతీ లాంటి 10కి పైగా భారతీయ భాషల్లో వాయిస్ సెర్చ్ సపోర్ట్ ఉంటుంది. వినియోగదారుల వీక్షణ అలవాట్లు, భాషా ప్రాధాన్యతలు, ప్రాంతీయ ఆసక్తులను పరిగణలోకి తీసుకుని ఏఐ ఆధారిత కంటెంట్ సిఫార్సులను అందిస్తుంది.
ఓటీటీ, లైవ్ ఛానెళ్లు, గేమ్స్‌కు యాక్సెస్..
జియో స్టోర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలో 400కిపైగా ఓటీటీ యాప్స్‌కు, 400 లైవ్ టీవీ ఛానెళ్లకు, 300కిపైగా జియో గేమ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. అదనంగా స్ట్రీమింగ్ డివైస్ అవసరం లేకుండా ఒకే టీవీలో అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ లభించేలా దీనిని రూపొందించారు.
డిస్‌ప్లే, సౌండ్, హార్డ్‌వేర్ ఫీచర్లు
ఈ స్మార్ట్ టీవీలో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే, బీజెల్-లెస్ డిజైన్ అందించారు. ఆడియో కోసం 36 వాట్ల స్టీరియో బాక్స్ స్పీకర్లను కూడా జత చేశారు. స్టాండర్డ్, స్పోర్ట్స్, మూవీ, మ్యూజిక్ లాంటి వివిధ సౌండ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ టీవీకి శక్తినిచ్చేది అమ్లాజిక్ ప్రాసెసర్, దీనికి 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని జోడించారు. సాధారణ యాప్ వినియోగం, నావిగేషన్ స్మూత్‌గా ఉండేలా ఈ సెటప్ రూపొందించబడింది.
వాయిస్ రిమోట్‌లో ప్రత్యేక షార్ట్‌కట్ బటన్లు
ఈ జియోటెల్ ఓఎస్‌పై నడిచే టీవీతో వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, జియో సినిమా, హాట్‌స్టార్‌లకు ప్రత్యేక షార్ట్‌కట్ బటన్లు ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన భాషలో వాయిస్ కమాండ్లతో టీవీని ఆపరేట్ చేయవచ్చు.
ధర అండ్ లాంచ్ ఆఫర్లు
బ్లౌపుంక్ట్ 32 అంగుళాల జియోటెల్ ఓఎస్ స్మార్ట్ టీవీ ధర రూ.9,699గా నిర్ణయించారు. ఇది జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తుంది. అదనంగా, అర్హత ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తానికి, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, బహుభాషా సపోర్ట్, భారీ కంటెంట్ లైబ్రరీతో కూడిన స్మార్ట్ టీవీని కోరుకునే కస్టమర్లకు ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.
