Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Jamun Jam: నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందుకు కారణం ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణంగా ఈ పండ్లను నేరుగా తింటారు. అయితే వీటితో ఇంట్లోనే ఎటువంటి రసాయన ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా రుచికరమైన జామ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జామ్‌ను బ్రెడ్, చపాతీ, దోశలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. సరైన విధానంలో తయారు చేసి భద్రపరిస్తే ఇది ఆరు నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
* నేరేడు పండ్లు – 500 గ్రాములు.
* చక్కెర – 400 గ్రాములు.
* నిమ్మరసం – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు.
* నీరు – తగినంత.
Also Read
- Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
తయారీ విధానం:
* ముందుగా అల్ల నేరేడు పండ్లను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో పండ్లను వేసి అవి మునిగేంత వరకు నీరు పోయాలి. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్‌పై 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. గిన్నెలో అయితే పండ్లు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి.
* పండ్లు బాగా ఉడికిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేత్తో నలిపి గింజలను వేరు చేయాలి. ఇప్పుడు మిగిలిన పండ్ల గుజ్జు, ఉడికించిన నీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
* ఈ మిశ్రమాన్ని మందపాటి కడాయి లేదా గిన్నెలోకి తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. మొదట మీడియం మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత మంటను తగ్గించి సన్నని మంటపై ఉంచి కలుపుతూ ఉడికించాలి. పండ్లలో సహజంగా ఉండే పెక్టిన్ విడుదలై మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత చక్కెరను జత చేయాలి.
* చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత జామ్ మిశ్రమం కొద్దిసేపు పలచబడుతుంది. కాబట్టి చిన్న మంటపైనే నిరంతరం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా జాగ్రత్త పడుతూ జామ్ చిక్కబడే వరకు ఉడికించాలి.
జామ్ సిద్ధమైందో లేదో ఎలా తెలుసుకోవాలి?
జామ్ సరైన పాకానికి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ప్లేట్ టెస్ట్ చేయాలి. ఒక ప్లేట్లో కొద్దిగా జామ్ వేసి కాస్త వంచి చూడాలి. జామ్ నుంచి నీరు విడిగా రాకుండా, ఒకే దగ్గర గట్టిగా ఉంటే సరైన పాకం వచ్చినట్టే. ఒకవేళ పలచగా అనిపిస్తే మరికొంతసేపు ఉడికించాలి.
నిమ్మరసం ఎందుకు వేయాలి?
జామ్ సరైన దశకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం వేసి బాగా కలపాలి. నిమ్మరసం జామ్‌లోని చక్కెర స్ఫటికాలుగా మారకుండా నిరోధించడమే కాకుండా సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో జామ్ ఎక్కువకాలం తాజాగా నిల్వ ఉంటుంది.
భద్రపరిచే విధానం:
తయారైన జామ్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత తడి లేని, శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేయాలి. సీసాలోకి నీరు లేదా తేమ చేరకుండా జాగ్రత్తపడితే ఈ జామ్‌ను ఫ్రిజ్‌లో పెట్టకుండానే సుమారు ఆరు నెలల వరకు తాజాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇంట్లోనే సులభంగా తయారయ్యే నేరేడు జామ్ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ జామ్‌ను ఒకసారి తప్పకుండా తయారు చేసి రుచి చూడండి.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!